సంక్రాంతి పండుగ వస్తే కోళ్ల పందేలు, పొటేళ్ల పందేలు నిర్వహించడం సాధారణం. కానీ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కాట్రేవ్పల్లిలో వరాహ పందేలు నిర్వహిస్తున్నారు.
వరాహాలతో పందేలు నిర్వహించడం వల్ల వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆంధ్రతోపాటు కర్ణాటక వాసులు తరలివస్తుంటారు.