నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతి చెందాడు. బంధువుల గ్రామానికి పుట్టిలో వెళ్లిన గుంటప్ప తిరిగి రాకపోయేసరికి..ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మేరకు కర్ణాటక రాష్ట్రం నది ఒడ్డున బాధితుడి మృతదేహం లభ్యమైంది.
ఏం జరిగిందంటే...
ముస్లైపల్లి గ్రామనికి చెందిన పాలెం గుంటప్ప(45).. ఈనెల 18న బంధువుల వివాహం నిమిత్తం కర్ణాటకలోని ఓ గ్రామానికి, కృష్ణానది తీరం గుండా పుట్టి వేసుకొని బయలుదేరారు. రెండు రోజులు గడిచినా అతను ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనుమానంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మేరకు కర్ణాటక సరిహద్దుల్లో బాధితుడి మృతదేహం లభ్యమైంది. శుభకార్యానికంటూ వెళ్లిన గుంటప్ప శవమై తిరిగిరావటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: పెన్నానదిలో ఏడుగురు గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం