గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. ఊట్కూరు మండలం బిజ్వార్లో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
డంపింగ్ యార్డు, స్మశాన వాటిక పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందుబాటులో లేని అధికారులపై చర్యలు తీసుకోవాలని... వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అశోక్ గౌడ్, సర్పంచ్ సావిత్రమ్మ, ఎంపీడీవో జయశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.