నారాయణపేటలోని ఆర్డీవో సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని.. ప్రతి అధికారి సమయపాలన పాటించాలని జిల్లా పాలనాధికారి ఎస్. వెంకట్రావు సూచించారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నారాయణపేట నుంచే అధికారులు విధులు నిర్వహించాలని...అందరి సహకారం కావాలని ఆయన కోరారు.
ఇదీ చదవండిః జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం