మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్.చేతన మీ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు ఇలా ఎక్కడైనా ఆకతాయిలు వేధిస్తే ఫిర్యాదు పెట్టెలో వారి సమస్య రాసి చీటీ వేసినట్లయితే సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేధింపులకు గురౌవుతున్న మహిళలు ఆ ఆకతాయిల ఆచూకీ తెలియజేస్తే వారి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాదు చేసిన వారు భయపడవద్దని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించారు.
- ఇదీ చూడండి : ఇక పంచాయతీల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్లు