నారాయణ పేట జిల్లాలో జరుగుతున్న నర్సరీల ఏర్పాటు పనులను కలెక్టర్ హరిచందన పరిశీలించారు. ధన్వాడ మండల కేంద్రంలోని నర్సరీని ఆమె తనిఖీ చేశారు.
జిల్లాలోనే ఈ నర్సరీని ఆదర్శంగా తీసుకోవాలనేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసినందుకు సర్పంచ్‌ను, అధికారులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీఓ, సర్పంచ్ పాల్గొన్నారు.