దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా వ్యాధి బారినపడకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. మంత్రి కేటీఆర్... సూచన మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలు కర్యాక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వర్షం నీరు నిలువ ఉన్న ప్రాంతాలను పరిశీలించి నీటిని తొలగించారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా.. ప్రతి ఒక్కరు వారి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకుంటూ... ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కరోనా కేసులు పెరుగుతునందున ప్రజలందరూ... మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.