నారాయణపేట జిల్లా కేంద్రలోని మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి కమిషనర్ శ్రీనివాసన్‌తో సమీక్ష నిర్వహించారు. పురపాలికల్లో సింగిల్ ప్లాట్లు ఉన్నవారు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని చంద్రా రెడ్డి తెలిపారు.
పురపాలికలో ఇంటిపన్ను బకాయిదారులకు వడ్డీపై 90 శాతం మినహాయించి చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దానికి గాను ఈనెల 15 వరకు గడువు ఉందన్నారు. గడువులోపు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వీధి వ్యాపారులకు సంబంధించిన రుణాల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యల తీసుకోవాలని సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో పుర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం