నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో ఓ వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి 62 ప్యాకెట్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ దాదాపు రూ.61,804 ఉంటుందని అంచనా వేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సూచించారు. నకిలీ విత్తనాలతో నష్టపోకూడదని చెప్పారు.