చెక్‌పోస్టుల వద్ద లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ - లాక్డౌన్ తీరును పరిశీలించిన ఎస్పీ చేతన
జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద లాక్డౌన్ పరిస్థితులను ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు. జలాల్పూర్ చెక్‌పోస్టును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.
నారాయణపేట జిల్లాలోని పలు చెక్‌పోస్టుల వద్ద లాక్డౌన్ పరిస్థితులను జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, కూలర్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఉదయం నుంచి పది గంటల వరకు వెసులుబాటు ఉన్న సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సమయంలో ఎవరైనా ప్రయాణం చేయాలంటే ఈ పాస్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
ఇదీ చూడండి: నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్, జరిమానా