ETV Bharat / state

ఉద్యోగాల పేరుతో మరోసారి మోసానికి కుట్ర: రేవంత్​రెడ్డి - telangana news today

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏవని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగాల పేరుతో మరోసారి మోసం చేయడానికి తెరాస కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఆయన పాల్గొన్నారు.

mp revanth reddy comment cheat once again in the name of jobs in telangana
ఉద్యోగాల పేరుతో మరోసారి మోసానికి కుట్ర: రేవంత్​రెడ్డి
author img

By

Published : Mar 4, 2021, 3:53 AM IST

తెరాస ప్రభుత్వం యువకులకు మాయమాటలు చెప్పి ఉద్యోగాల పేరిట మరోమారు మోసం చేయడానికి కుట్ర పన్నుతోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తూ తన కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టి దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ సాధించకుంటే రాష్ట్రంలో ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తప్పకుండా ప్రతిపక్షం ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ ఇంఛార్జీ శివకుమార్​తోపాటు కొడంగల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇదీ చూడండి : 'న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.