నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని చూసి.. రాబోయే ఎన్నికల్లో మక్తల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 14వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
భాజపా, స్వతంత్ర అభ్యర్ధులు ఇద్దరు ఎమ్మెల్సీలుగా పనిచేశారని.. వారు పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయలేదని గుర్తు చేశారు. తెరాస నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నిల్చున్న గెలవలేడని ఎద్దేవా చేశారు. తెరాస హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, వీరారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నాలుగో టెస్టు: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్