నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో మంగళవారం ఘనంగా కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సూచించారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ప్రధాన అలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!