నారాయణపేట జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యిందని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మక్తల్, సంగంబండలో వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలనతోపాటు చెక్ పోస్ట్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ నిజాం పాషా, జడ్పీ ఛైర్పర్సన్ వనజ, కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.