ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొవిడ్ కట్టడికి ప్రతి జిల్లాలో 10 పడకలతో కూడిన ఐసీయూ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన 10బెడ్ ఐసీయూ ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీవోల గ్రూప్ నిర్వహిస్తోన్న ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి క్రిటికల్ కేర్ ఐసీయూ యూనిట్‌ను నారాయణపేట్ జిల్లాలో వర్చువల్‌గా ప్రారంభించారు.
మూడో వేవ్, తదనంతరం వేవ్‌లు తట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని... గత ఏడు సంవత్సరాల్లో 1600 ఐసీయూ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా ఇప్పటికే ఏర్పడ్డాయని, మరో 7 కొత్తవి రానున్నాయని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: Komatireddy: 'ఈటల వర్గీయులను కాదు... ధాన్యం కొనండి'