ETV Bharat / state

"ధ్యానంతో మానసిక ప్రశాంతత మీ సొంతం" - narayanpet collector venkatrao

ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్​ రొనాల్డ్​ రోస్​ తెలిపారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతి ఒక్కరూ రోజు కనీసం అరగంట సేపు ధ్యానం చేయాలని కోరారు.

"ధ్యానంతో మానసిక ప్రశాంతత మీ సొంతం"
author img

By

Published : Apr 17, 2019, 8:24 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని శ్రీపాద వల్లభపురంలో ఒక రోజు ధ్యాన కేంద్రాన్ని నిర్వహించారు. కన్హా శాంతి వనం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లా పాలనాధికారులు రొనాల్డ్ రోస్, ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రొనాల్డ్ రోస్ వివరించారు.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని శ్రీపాద వల్లభపురంలో ఒక రోజు ధ్యాన కేంద్రాన్ని నిర్వహించారు. కన్హా శాంతి వనం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లా పాలనాధికారులు రొనాల్డ్ రోస్, ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రొనాల్డ్ రోస్ వివరించారు.

ఇదీ చూడండి: అకాల వర్షానికి 36మంది బలి - సాయంపై రగడ

Intro:Tg_mbnr_04_17_Collecters_visit_vallabhapuram_Av_C12
శ్రీ పాద వల్లభాపురంలో కన్హా శాంతి వనం ధ్యానం కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు.


Body:నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లోని శ్రీపాద వల్లభ పురంలో కన్హా శాంతి వనం ధ్యానం ఆధ్వర్యంలో ఒక రోజు ధ్యాన కేంద్రాన్ని నిర్వహించారు. దీనికి గాను మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్ నారాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కన్హ శాంతి వనం ధ్యానం సంస్థ అధినేత కమలేష్ డి. పటేల్ ,కలెక్టర్ల తో పాటు అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామప్రజలు సుమారు గంటకు పైగా ధ్యానం చేశారు అనంతరం కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. పని ఒత్తిడి నుండి ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కరూ కనీసం అర గంట సేపైనా ధ్యానం చేయాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచులు కలెక్టర్లను శాలువతో కప్పి సన్మానించారు.


Conclusion:ఈ కార్యక్రమంలో కన్హ శాంతి వనం ధ్యానం సంస్థ అధినేత కమలేష్ డి. పటేల్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ , నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీవో శ్రీనివాస్, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ విజయనిర్మల, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీలు ,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.