ETV Bharat / state

మక్తల్​ రైల్వే లైన్​ పూర్తి.. త్వరలో సర్వీసులు - నారాయణపేట జిల్లా

నారాయణపేట జిల్లా మక్తల్​ మండల కేంద్రంలో జక్లేర్​ మీదుగా రైలు ట్రయల్​ రన్​ నిర్వహించారు. మండల పరిధిలోని పలు​ రైల్వే లైన్​ మరమ్మత్తు పనుల్లో భాగంగా ఏడాదిన్నర కిందట జక్లేర్​ వరకు పనులు పూర్తయ్యాయి. అధికారులు పరిశీలనకు రానున్న నేపథ్యంలో జక్లేర్​ నుంచి మక్తల్​కి ట్రయల్​ రన్​ నిర్వహించారు.

Makthal Railway Line Trail Run Starts
మక్తల్​ రైల్వే లైన్​ పూర్తి.. త్వరలో సర్వీసులు
author img

By

Published : Jun 4, 2020, 4:50 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్​లో జక్లేర్​ మీదుగా రైల్వే అధికారులు రైలు ట్రయల్​ రన్​ నిర్వహించారు. దేవరకద్ర, మునీరాబాద్​ రైల్వే లైన్​ పనులు పూర్తయిన సందర్భంగా జక్లేర్​ వరకు ఈ నెల 3, 4 తేదీల్లో ఉదయం నాలుగు గంటలకు ఒక రైలు వచ్చి పోయేది. అక్కడి నుంచి మక్తల్​ వరకు 12 కిలోమీటర్ల మేర రైల్వే పనులు పూర్తయ్యాయి.

జక్లేర్​ నుంచి మక్తల్​ వరకు రైలు మార్గాన్ని పరిశీలించే నేపథ్యంలో ట్రయల్​ రన్​ వేశారు. ఉన్నతాధికారులు పరిశీలనకు రానున్న నేపథ్యంలో ట్రయల్​ రన్​ నిర్వహించి లోపాలు లేకుండా సరి చూసుకున్నారు. మక్తల్​ వరకు రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల వ్యాపారులు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.