రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అనుమతి పాసులు పొందవచ్చని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన తెలిపారు. వైద్యం, సరుకుల కోసం బయటకు వెళ్లేవారు, తమ స్వస్థలాలకు వెళ్లే కార్మికులు ఇబ్బంది పడకుండా ఈ-పాస్ విధానాన్ని రాష్ట్ర పోలీసు శాఖ అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించారు.
టీఎస్ పోలీస్ జీవోవీ సైట్ ద్వారా ఆన్ లైన్లో వ్యక్తిగత గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. పోలీసు శాఖ అందిస్తున్న ఈ-పాస్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.