నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జాతర ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. రేపు ఉదయం 6 గంటలకు రథోత్సవం, సాయంత్రం పాలోట్లు జరగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. జాతర ఉత్సవాలను తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అనేకమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కన్నుల పండువగా స్వామివారి కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను చూసి తరించారు.