పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలబారి నుంచి తప్పించుకోవచ్చని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యాచరణపై ఆరా తీశారు.
ప్రజల సహకారం లేనిది ఏ పని విజయవంతం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ఆటోలో వేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు సరైన రీతిలో కొనసాగడం లేదని ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వెలిబుచ్చారు.