కల్యాణ లక్ష్మి పథకం నిరుపేద కుటుంబాలకు వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఏం టేస్ట్ గురూ... కల్లు తాగిన మంత్రులు