ETV Bharat / state

క్వారంటైన్​ ముద్ర వేయించుకుని వలస కార్మికుల ప్రయాణాలు

వలసకూలీలు స్వగ్రామాలకు వెళ్లొచ్చన్న ఆదేశాలతో నారాయణపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలు సొంతూర్లకు పయనమయ్యారు. తమ స్వస్థలాల్లోనే హోంక్వారంటైన్ ఉంటామంటూ ముద్ర వేయించుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

immigrants-travel-with-quarantine-stamp-at-narayanpet
క్వారంటైన్​ ముద్ర వేయించుకుని వలస కార్మికుల ప్రయాణాలు
author img

By

Published : May 11, 2020, 12:05 PM IST

మహారాష్ట్రకు వలస వెళ్లిన తెలంగాణ కూలీలు అక్కడ పని లేనందున తమ సొంత గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. మార్చి నుంచి దేశ వ్యాప్త లాక్​డౌన్​ కారణంగా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. పనులు లేనందున తినడానికి తిండిలేక అక్కడే ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మే 4న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు స్వగ్రామాలకు పయనమయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో తమ సొంత వాహనాల్లో కొందరు, అద్దె వాహనాలు మాట్లాడుకుని మరికొందరు కూలీలు సొంతూర్లకు పయనమయ్యారు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత డాక్టర్లు పరీక్షించి వారి చేతికో ముద్ర వేసి 28 రోజులు ఇంటి నుండి జనావాసాల్లో తిరుగకూడదని హోంక్వారంటైన్​ ఉండాలని సూచిస్తున్నారు.. అయిన గత వారం రోజులుగా కొంత మంది వలసకూలీలు తమ స్వస్థలాల్లోనే హోంక్వారంటైన్​ ఉంటామంటూ క్వారంటైన్​ ముద్ర వేయించుకుని నారాయణపేట జిల్లా గుండా బయలుదేరి వెళ్తున్నారు. దీనితో ఆ ప్రాంత వాసులు కరోనా భయంతో అధికారులను, వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

క్వారంటైన్​ ముద్ర వేయించుకుని వలస కార్మికుల ప్రయాణాలు

"మాది వనపర్తి.. మేము మహారాష్ట్రలో కూలీకి వెళ్లాము. అక్కడి నుంచి సుమారు 30 మందిమి సొంతూర్లకు వచ్చాము. డాక్టర్​తో పరీక్షలు చేయించుకున్నాం.. హోం క్వారంటైన్​ సూచించారు- వలసకార్మికుడు"

ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.