నారాయణపేట జిల్లా కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మక్తల్ నియోజకవర్గంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణా నది వరదకు భీమా నది తోడవటం వల్ల తంగిడి వద్ద వరద ఉప్పొంగుతోంది. గూడూరు వద్ద ఉన్న రోడ్డు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. రాత్రి సమయానికి వాసునగర్, హిందూపూర్‌కు వరద చుట్టుముట్టే అవకాశం ఉంది. కృష్ణ, భీమా నదులు కలిపి దాదాపు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు.
అప్రమత్తమైన అధికారులు....
నది పరివాహకాల్లోని అన్ని గ్రామాల వద్ద రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు, గట్టి భద్రత ఏర్పాటు చేశారు. నది సమీపానికి ఎవరు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాసునగర్, కృష్ణా ఘాట్ల వద్ద విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు అధికారులు అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరగటం వల్ల 100 నుంచి 150 ఎకరాల పొలాలు ముంపునకు గురై ఉండవచ్చని అనధికారికంగా తెలిపారు.
ఇవీ చూడండి: ఇందూరులో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం