ETV Bharat / state

Harish Rao On BJP Congress : 'రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్​ గెలిచేది లేదు' - harishrao fires on congress party

Harish Rao On BJP Congress in Narayanpet Meeting: మాటలు చెప్పే సర్కార్​ కావాలో.. చేతల సర్కార్​ కావాలో ప్రజలే తేల్చుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్​ఎస్​ బహిరంగసభలో పాల్గొని.. కాంగ్రెస్, బీజేపీల​పై విమర్శలు చేశారు.

Minister Harish Rao
Minister Harish Rao Speech at Narayanpet BRS Public Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 3:14 PM IST

Updated : Oct 4, 2023, 3:33 PM IST

Harish Rao On BJP Congress 'రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్​ గెలిచేది లేదు'

Harish Rao On BJP Congress in Narayanpet Meeting : రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్​ గెలిచేది లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు(Minister Harish Rao) అన్నారు. మాటలు చెప్పే సర్కార్​ కావాలో.. చేతల సర్కార్​ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లాలోని కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన.. అనంతరం ప్రభుత్వ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో(BRS Public Meeting) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విమర్శించారు.

Harish Rao At Narayanpet Public Meeting : "కొడంగల్​ నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయి. కొడంగల్​కు ప్రస్తుతం కృష్ణా నుంచి తాగునీరు వస్తోంది. త్వరలోనే సాగునీరు కూడా వస్తుంది. కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లటం ఖాయం. 3 వేల తండాలను సీఎం కేసీఆర్‌ గ్రామపంచాయతీలుగా మార్చారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు మహిళల కష్టాలు తీర్చారు కేసీఆర్‌. ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టనున్నారని" మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు.

Harish Rao Fires on Congress : కాంగ్రెస్​ పాలనలో 'నేను రాను బిడ్డో.. సర్కార్​ దవాఖానాకు' అని పాడుకునేవారని మంత్రి హరీశ్​రావు గుర్తు చేశారు. కానీ కేసీఆర్ హయాంలో సర్కార్ దవాఖానాలే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మారాయని తెలిపారు. బిడ్డ కడుపున పడినప్పటి నుంచే ప్రభుత్వ సాయం అందుతోందని చెప్పారు. అదే విధంగా గర్భిణీలకు రూ.12 వేలు ఇస్తున్నామని.. కాన్పు తర్వాత కేసీఆర్​ కిట్​ను ఇస్తున్నామని వివరించారు. ఇంకా 12 లక్షల మంది ఆడపిల్ల వివాహాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేశామన్నారు. అదే పొరుగున ఉన్న కర్ణాటకలో ఎలాంటి పథకాలు ఉన్నాయో తెసుకోవాలని సూచించారు. ఆ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛనుగా నెలకు కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.

"ఆడపిల్లలు చదువుకోవాలి.. పైకి రావాలని చెప్పి.. పెద్ద ఎత్తున పిల్లల కోసం డిగ్రీ కాలేజీలు, పీజీ కళాశాలలు ఎన్నో కార్యక్రమాలు తెచ్చారు. మహిళా యూనివర్సిటీని కూడా రాష్ట్రంలో సీఎం ప్రారంభించారు. మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ఏ పని చేసిన మహిళలకే లబ్ధి అందాలని చెప్పారు. మహిళలను ఇంకా ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలి. మహిళల కోసం మేనిఫెస్టోలో మహిళల కోసం శుభవార్తను కచ్చితంగా వింటారు." - హరీశ్​రావు​, మంత్రి

Minister Harish Rao Comments On Amit Shah : 'సీఎం పదవి కాదు కదా.. ఈసారి సింగిల్​ డిజిట్​ సాధించేందుకు పోరాడండి'

Minister Harish Rao Visit to Narayanpet : అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుబంధు, రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వట్లేదని కాంగ్రెస్​ నాయకత్వాన్ని మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు కావాలనుకునేవాళ్లు కాంగ్రెస్​కు ఓటు వేయాలని.. 24 గంటలు కరెంటు కావాలంటే బీఆర్​ఎస్​కు ఓటు వేయాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసిన గులాబి జెండా మళ్లీ ఎగురుతుందనీ.. కేసీఆర్​ ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారని చెబుతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. అలాగే కొడంగల్​ నియోజకవర్గంలో పట్నం నరేందర్​ను గెలిపించుకుని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలను కోరారు. అంతకు ముందు హరీశ్​రావు పర్యటన సందర్భంగా బస్​డిపో నుంచి శివాజీ చౌరస్తా వరకు బీఆర్​ఎస్​ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు.

Harish Rao on New Schemes : 'త్వరలోనే సీఎం కేసీఆర్‌ కొత్త పథకాలను ప్రకటిస్తారు'

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు కాదు.. ఆర్నెళ్లకో సీఎం వస్తారు: మంత్రి హరీశ్​రావు

Last Updated : Oct 4, 2023, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.