నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేద కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు 5 కిలోల చొప్పున బియ్యం, సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
నేటి నుంచి లాక్డౌన్ పూర్తయ్యే వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని భాజపా రాష్ట్ర మహా సంపర్క్ అభియాన్ ఛైర్మన్ కొండయ్య తెలిపారు.
ఇవీ చూడండి: కరోనాతో... ఆ తర్వాత ఇబ్బందే..!