ETV Bharat / state

ఫ్యాన్లు లేక విలవిల్లాడుతున్న తల్లులు

ఒక్కసారిగా పెరిగిన వేడి ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్​ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ముక్కుపచ్చలారని చిన్నారులు విలవిల్లాడుతున్నారు.

ఫ్యాన్లు లేక విలవిల్లాడుతున్న తల్లులు
author img

By

Published : May 16, 2019, 11:27 PM IST

ఫ్యాన్లు లేక విలవిల్లాడుతున్న తల్లులు

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ముక్కుపచ్చలారని చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. మాతా శిశు కేంద్రంలో నెలరోజులుగా ఫ్యాన్లు మరమ్మతు చేయకపోవడం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు ఇళ్ల నుంచి ఫ్యాన్లు తెచ్చుకొని మంచాల పక్కన ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు తల్లులు విసనకర్రతో ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న వేడి దృష్ట్యా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఆమె భేషరతుగా క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్​

Intro:Tg_mbnr_07_16_govt_hospital_av_C12
ఒక్కసారిగా పెరిగిన వేడి ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.మాతా శిశు కేంద్రంలోని వార్డులో సరిపోను ఫ్యానులు లేక ఎండవేడికి బాలింతలతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులు విలవిల్లాడుతున్నారు, ఆస్పత్రిలో ఉండాలంటే విధిగా ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు కేంద్రంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు ముక్కుపచ్చలారని చిన్నారుల్లో ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు, మాతా శిశు కేంద్రంలో ప్రతి వార్డు లో ఫ్యాన్లు పని చేయక నెలరోజులైనా మరమ్మతు చేయకపోవడంతో బాలింతలు ఉక్కపోత అవస్థలు పడుతున్నారు కొందరు భరించలేక ఇళ్ల నుంచి ఫ్యాన్లు తెచ్చుకొని మంచాల పక్కన ఏర్పాటు చేసుకున్నారు,మరి కొందరు తల్లులు విసనకర్రతో ఇబ్బందులు పడుతున్నారు రోగులకు వారి కుటుంబ సభ్యులకు త్రాగునీరు సైతం లేక రోగులు సొంతంగా డబ్బులు వెచ్చించి త్రాగు నీటి బాటిల్ ను కొనుక్కుంటున్నారు. ఫ్యాన్లు లేక ఒకవైపు బాలింతలు ఇబ్బంది పడుతుంటే అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని వారు వాపోయారు. తల్లి పిల్లల పరిస్థితి చూడలేక అదనపు ఖర్చు అయినా తప్పక ఫ్యాన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

Conclusion:అధిక వేడి రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా తమకు కలుగుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే సమస్యను పరిష్కరించాలని బాలింతలు కోరుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.