అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని అధికారులను ఆదేశించారు నారాయణపేట కలెక్టర్ హరిచందన. జిల్లాలోని బీరప్పల గ్రామాన్ని ఆమె సందర్శించారు. గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలింతలకు, మూడు సంవత్సరాలలోపు చిన్నారులకు అందిస్తున్న పౌష్టిక ఆహారంపై ఆరా తీశారు.
అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన న్యూట్రి గార్డెన్‌ను పరిశీలించారు. ఇంటింటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థల సమస్యలు ఉన్నచోట సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జైపాల్ రెడ్డి, ఎంపీడీవో సందీప్ కుమార్, సీడీపీఓ జయ, కాళిందిని తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి