ETV Bharat / state

దేశానికే దిక్సూచీలుగా రైతువేదికలు: ఎమ్మెల్యే - నారాయణ పేటలోని రైతువేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

రైతులను ఏకం చేసేందుకే రైతువేదికలని.. ఇవి దేశానికే దిక్సూచీలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల్లో రైతువేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

foundation stone to the raitu vedika building constructions by mla rajendhar reddy in narayana peta district
దేశానికే దిక్సూచీలుగా రైతువేదికలు నిలుస్తాయ్​: ఎమ్మెల్యే
author img

By

Published : Jul 22, 2020, 2:10 PM IST

నారాయణపేట జిల్లాలోని పలు గ్రామల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకి శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బైరంకొండ, పేరపళ్ల, కోటకొండ,, కొలంపల్లి గ్రామాలలో రైతు వేదికల నిర్మాణానికి ఆయన మంగళవారం భూమిపూజ చేశారు.

రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం చేపట్టామని, రైతు వేదికలు దేశానికి దిక్సూచీలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. వీటి నిర్మాణం రెండు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు.

ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.