ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు - Fake Seeds Seized latest news

రైతుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని వారికి నకిలీ విత్తనాలు అంటగడుతున్న అక్రమార్కులను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకుంటున్నారు. నారాయణపేటలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి నుంచి రూ.1,13,190 విలువ గల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

Fake Seeds Seized in Narayanapeta district
నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు
author img

By

Published : Jun 19, 2020, 6:27 AM IST

నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం పెద్ద జట్రం గ్రామంలో టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఐజా తిమ్మారెడ్డి అనే వ్యక్తికి చెందిన నకిలీ పత్తి విత్తనాలు 83 ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.77,190 ఉంటుందని పోలీసులు తెలిపారు.

అలాగే 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వీటి విలువ రూ. 36,000 ఉంటుందని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్​కు తరలించారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.