ETV Bharat / state

'అది బూటకపు ఎన్​కౌంటర్.. కోర్టు తీర్పు వరకు ఆగాల్సింది'

'మా వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పే.. అయితే వాళ్లను శిక్షించడానికి కోర్టు ఉంది. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. కేవలం 8 రోజుల్లోనే వారిని బూటకపు ఎన్​కౌంటర్​లో చంపేయటం దారుణం. కోర్టు నిందితులకు ఉరిశిక్ష వేసినా.. మేం మద్దతిస్తామని చెప్పాం. అలాంటిది.. మాతో ఒక్క మాటైనా చెప్పకుండా.. కనీసం కలిసే అవకాశం కల్పించకుండా.. మధ్యలోనే వారిని ఎన్​కౌంటర్ చేయడం ముమ్మాటికీ తప్పే. ఒత్తిళ్లకు తలొగ్గినందుకే పోలీసులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. పేదలం కాబట్టే మా బిడ్డలను చంపేశారు. కోర్టులు అవసరం లేదనుకుంటే ఇలాంటి నేరాలకు పాల్పడ్డవారందరినీ పోలీసులు ఎన్​కౌంటర్ చేయాలి.'             ----ఎన్​కౌంటర్ బాధితుల కుటుంబ సభ్యులు

Disha
కోర్టు తీర్పు వరకు ఆగాల్సింది
author img

By

Published : Dec 8, 2019, 8:20 PM IST

దిశ హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై జాతీయ మానవ హక్కుల కమిషన్ నిజనిర్ధరణ బృందం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల కుటుంబసభ్యులను తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్​కు తరలించారు. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ఆరిఫ్ తండ్రి హుస్సేన్, గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు తండ్రి కురుమయ్య, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి జొల్లు రాజప్పలను తెల్లవారుజామునే తీసుకెళ్లారు.

పోలీసులపై దాడి చేశారా?

జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఎదుట వీరిని హాజరుపరిచారు. శనివారం మహబూబ్​నగర్​లో మానవ హక్కుల కమిషన్ బృందం.. నిందితుల కుటుంబసభ్యులతో మాట్లాడుతుందని అంతా భావించారు. కానీ వారిని కలవకుండానే బృందం నగరానికి చేరుకుంది. పోలీసుల చర్యపై నిందితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు రాకుండానే పోలీసులు బూటకపు ఎన్​కౌంటర్​లో నిందితులను హతమార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న నిందితులు పోలీసులపై ఎదురుదాడికి దిగారనటం హాస్యాస్పదమన్నారు. అర్థరాత్రి నిందితులను ఘటనా స్థలంలోకి తీసుకెళ్లి విచారణ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

నిందితులందరినీ ఎన్​కౌంటర్ చేయండి..

పోలీసులు సరిగ్గా విధులు నిర్వర్తించి ఉంటే ఐదు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి తలెత్తేది కాదని ఏ4 నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక ఆరోపించారు. మద్యం మహమ్మారి మూలంగానే ఘటన జరిగి తాను దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. వెంటనే మద్యం నిషేధించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తన భర్తను ఎన్​కౌంటర్​లో చంపేశారని ఆరోపించారు. కోర్టులతో పని లేదనుకుంటే.. అత్యాచార కేసుల నిందితులందర్నీ ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్ చేశారు. అనాథగా మారిన తనకు ప్రభుత్వ పెద్దలే న్యాయం చేయాలని కోరారు.

మృతదేహాలను అప్పగించండి..

తల్లిదండ్రులు లేని చెన్నకేశవులు భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. చెన్నకేశవులు మృతితో భర్తను కోల్పోయి, తల్లిదండ్రులు లేక ఆమె అనాథగా మారిందని, పుట్టే బిడ్డ సైతం తండ్రి లేని బిడ్డ అవుతుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెకు పోలీసులు, ప్రభుత్వ పెద్దలు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా విచారణ ముగించి మృతదేహాలను అప్పగించాలని కోరారు.

అత్యాచార నిందితులందరినీ ఎన్​కౌంటర్ చేయాలి

ఇదీ చూడండి: ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

TG_MBNR_07_08_ACCUSED_FAMILY_MEMBERS_AVB_3068847 రిపోర్టర్ స్వామి కిరణ్ కెమెరామెన్ శ్రీనివాస్ ( ) చటాన్ పల్లి దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ నిజనిర్ధారణ బృందం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల కుటుంబ సభ్యులను తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అరిఫ్ తండ్రి హుస్సేన్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు తండ్రి కురుమయ్య, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి జొల్లు రాజప్ప లను తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్ కు తీసుకువెళ్లారు . జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఎదుట వీరిని హాజరు పరిచే అవకాశం ఉంది. నిన్నే మహబూబ్ నగర్ లో NHRC బృందం కుటుంబ సభ్యులతో మాట్లాడుతుందని అంతా భావించారు. కానీ వారిని కలవకుండానే బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఇవాళ వారితో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు పోలీసుల చర్య పై నిందితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు రాకుండానే పోలీసులు ఎన్కౌంటర్లో నిందితులను హతమార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు లేని చెన్నకేశవులు భార్య ప్రస్తుతం నిండు గర్భిణీ . చెన్నకేశవులు మృతితో భర్తను కోల్పోయి , మరో వైపు తల్లిదండ్రులు లేక ఆమె అనాధగా మారిందని, పుట్టే బిడ్డ సైతం తండ్రి లేని బిడ్డ అవుతుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెకు పోలీసులు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు వీలైనంత త్వరగా విచారణను ముగించి మృతదేహాలను అప్పగించాలని వేడుకున్నారు బైట్ మొదటి బైట్ రేణుక , చెన్నకేశవులు భార్య రెండో బైట్ ....జయమ్మ, చెన్నకేశవులు తల్లి మూడో బైట్....ఆంజనేయులు, చెన్నకేశవులు బంధువు నాలుగో బైట్....లక్ష్మీ, నవీన్ బంధువు ఐదో బైట్ ....మణెమ్మ, శివ తల్లి ఆరో బైట్ ...రాజేశ్వరి, శివ సోదరి ఏడో బైట్ ...మౌలాన్ బీ, అరిఫ్ తల్లి 4జీ ద్వారా ఫీడ్ పంపాంము దయచేసి వాడుకోగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.