నిత్యావసర వంట గ్యాస్‌ను నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారుల అక్రమాలకు నారాయణపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అడ్డుకట్ట వేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న మాచన రఘునందన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దులోని కృష్ణ మండలంలో, కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి రోడ్డు ప్రాంతంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలను ఆయన గుర్తించారు.
గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్రమ నిల్వలను అడ్డుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: బోరు బావిలో పడ్డ బాలుడు మృతి