నారాయణపేట జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. జిల్లాలో 11 జడ్పీటీసీ స్థానాలకు 36 మంది బరిలో ఉండగా...140 ఎంపీటీసీ స్థానాలకు 400 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో గదులు ఎక్కువగా ఉన్నాయని ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ చూసేందుకు అనుకూలంగా లేదని నిలబడి కౌంటింగ్ చూడాల్సిన వస్తోందని మండిపడ్డారు.
ఇవీ చూడండి: నాగర్కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు