నారాయణపేట జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు ఎంతవరకు తెలుసని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాజ్యాంగ దివస్ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. రాజ్యాంగ దివస్ను పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి చేసిన సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి: ముంబయి దాడికి 11 ఏళ్లు- అమరులకు ఘన నివాళులు