నారాయణపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు దీనికి సహకరించాలని కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన కోరారు. ఓటు వేసేందుకు వచ్చే వారు త్వరగా వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జన సంచారం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. దివ్యాంగులకు కేంద్రంలో ప్రత్యేకమైన సౌకర్యాలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి: 'ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు'