నారాయణపేట జిల్లా అటవీ సంపదలో వెనుకబడింది. ఈ నేపథ్యంలో నారాయణపేట్, మక్తల్, మర్రికల్ ప్రధాన రహదారికి ఇరువైపులా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, నారాయణపేట ఎమ్మెల్యే రాజవర్ధన్ రెడ్డిలు మొక్కలు నాటారు. నారాయణపేట జిల్లా హరితవనంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రావు, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిలు పిలుపునిచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంట పొలాల యజమానులు కొన్ని రోజులు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 30వేల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్