నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్లో కరోనా పాజిటివ్ నమోదు కావడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ హరిచందన, డీఎంహెచ్వో జయచంద్రమోహన్, ఎస్పీ డా.చేతనతోపాటు మిగతా అధికారులు జక్లేర్లోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎలాంటి నిరాశకు గురికావొద్దని, పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం వైద్యం అందిస్తుందని తెలిపారు.
గ్రామాన్ని పూర్తిగా నిర్భంధంలో ఉంచాలని, ఎలాంటి రాకపోకలను అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసిన వారు హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్