నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం లక్ష్మీపూర్‌లో దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. గోపాల్‌ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా చంపేశారు. గొడ్డళ్లతో నరికి తలను వేరు చేశారు. తెల్లవారుజామున సమాచారం అందుకున్న నారాయణపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నారాయణ పేట సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ చంద్ర మోహన్ హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో మృతుడికి ఎవరితోనూ విరోధం లేదని గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చూడండి : ఆస్పత్రిలోకి నో ఎంట్రీ- 6 గంటలు రోడ్డుపైనే కరోనా రోగులు