Bandi sanjay with Migrant workers: ముఖ్యమంత్రి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఉపాధి కల్పించకుండా కేసీఆర్ పాలమూరును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వలసలు ఎక్కడ ఆగాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముంబయి వెళ్తున్న నారాయణపేట జిల్లా వాసులను పలకరించారు. వలస కార్మికులు వెళ్తున్న బస్సులో ఎక్కి వారితో సంజయ్ మాట్లాడారు. ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏమి పనులు చేస్తారు. అక్కడ లభించే ఉపాధి.. ఇక్కడ లభించడం లేదా అంటూ వారి బాగోగులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. చంటి పిల్లలను ఎత్తుకుని మూట, ముల్లె సర్దుకుని ప్రతి రోజూ వందల మంది ఉపాధి వలసలు పోతున్నారంటే కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ అబద్ధాలతో పుట్టిన వ్యక్తి. అది నోరు కాదు తాటిమట్ట. పాలమూరుకు సాగునీరు, తాగునీరు రావాలె. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతారు. వలసలు ఆపాలంటే దృఢ సంకల్పం కావాలె. 68 జీవో ద్వారా ప్రాజెక్టులు రావాలె. సీఎం ఆపాలనుకుంటే వలసలు ఆగుతాయి. ముఖ్యమంత్రికి మానవత్వం లేదు.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ప్రభుత్వం వలసలు ఆగాయని చెబుతోంది.. అవీ ఎక్కడ ఆగాయో చెప్పాలని ప్రశ్నించారు. వలసలు ఆగమంటే ఆగవని.. వాటిని ఆపగలిగేలా పాలన అందించాలని అన్నారు. అందు కోసం పాలమూరు పచ్చగా ఉండాలని సూచించారు. అవసరమైన సాగు, తాగునీరు వసతులు కల్పించి ఉపాధి కల్పిస్తే తప్ప పాలమూరు వలసలు ఆగవని బండి సంజయ్ అన్నారు. ముంబయి వలస వెళ్తున్న కార్మికులతో బండి సంజయ్ ముచ్చటించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు నిజాలు చూపేందుకే ఈరోజు వాస్తవ విషయాలను మీకు తెలియజేస్తున్నట్లు వివరించారు. పాలమూరు పచ్చబడాలన్నా... వలసలు ఆగాలన్నా పాలకుల్లో సంకల్పం, మానవత్వం ఉండాలన్నారు. కానీ సీఎం కేసీఆర్ మానవత్వం పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగు నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగానే 69 జీవోను అమలు చేసి నారాయణపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఏమీ లేవు.. అక్కడ ఉండలేక హైదరాబాద్ వస్తున్నారు..'
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది: నితిన్ గడ్కరీ
శివసేన ర్యాలీలో ఉద్రిక్తత.. రెండు వర్గాల రాళ్ల దాడులు
దండలు మార్చుకున్నారు.. కాసేపట్లో మూడు ముళ్లు.. ఇంతలోనే వధువును కాల్చి చంపి..