నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి వద్ద ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం దగ్గర భాజపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఒకటే కొనుగోలు కేంద్రం ఉండటం వల్ల రోజువారీగా మండలానికి చొప్పున 10 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.
సీసీఐ కేంద్రంలో ఏ గ్రేడ్ పత్తి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. మిగతా బీ, సీ గ్రేడ్ పత్తి తీసుకువచ్చిన రైతులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులు తమ పత్తిని ఎక్కడ అమ్మాలో తెలియక అయోమయానికి గురి అవుతున్నారని కార్యకర్తలు పేర్కొన్నారు. భాజపా ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఊట్కూర్ తహసీల్దార్, ఎస్సై రవి చేరుకొని పై అధికారులుతో మాట్లాడి టోకెన్లు పెంచే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్'