ETV Bharat / state

కేసీఆర్​కు భాజపా భయం పట్టుకుంది: బండి సంజయ్ - తెలంగాణ వార్తలు

నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పంపల్లిలో స్వామి వివేకానంద విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు. వివేకానంద స్ఫూర్తితో దేశంలో మోదీ పాలన కొనసాగుతోందని బండి సంజయ్‌ తెలిపారు.

కేసీఆర్​కు భాజపా భయం పట్టుకుంది: బండి సంజయ్

author img

By

Published : Dec 20, 2020, 5:49 PM IST

రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌కు భాజపా భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పంపల్లిలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. వివేకానంద స్ఫూర్తితో దేశంలో మోదీ పాలన కొనసాగుతోందని బండి సంజయ్‌ తెలిపారు.

కొందరు భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారన్న ఆయన... హిందూ ధర్మ రక్షణ కోసమే తమ పార్టీ పనిచేస్తుందన్నారు. 2023లో గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నారాయణపేటలో జరిగే రైతు సమ్మేళనానికి బండి సంజయ్‌ హాజరయ్యారు.

పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అనంతరం పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలతో సంజయ్‌ సమావేశం కానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.