పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నారాయణపేట జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలనాధికారి హరిచందన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల పంపిణీని ఆమె పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తరలించే ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం 20 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించి, పోలింగ్ శాతాన్ని వెల్లడించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,891 ఓటర్లు ఉన్నారన్న ఆమె.. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: వరంగల్ అర్బన్ జిల్లాలో పట్టభద్రుల పోలింగ్‌కు ఏర్పాట్లు