
నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామ సమీపంలో బియ్యంలోడ్ తో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్‌ను తప్పించబోయి ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ దుర్ఘటనలో లారీ డైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన జనార్దన్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ