నారాయణపేట జిల్లా మక్తల్ పురపాలిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు వెల్లువెత్తాయి. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఉదయం నుంచి బారులుతీరారు. 5 గంటల లోపు నామినేషన్ వేసేందుకు కేంద్రంలోకి వచ్చిన వారందరికీ అనుమతి ఇవ్వడంతో... దాదాపు 6 గంటల వరకు నామినేషన్లు సమర్పించారు. రెండో రోజు 64 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు ఆరు నామినేషన్లతో కలిపి నామినేషన్ల సంఖ్య 70 చేరింది. తెరాస 22, భాజపా 26, కాంగ్రెస్ 6, స్వతంత్ర అభ్యర్థులు 9, ఇతరులు ఒకటి దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
- ఇవీ చూడండి: యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం