ETV Bharat / state

YS SHARMILA PROTEST: వైఎస్ పేరెత్తే అర్హత కేసీఆర్​కు లేదు: షర్మిల - నిరాహార దీక్షలో షర్మిల

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని... వీసీలు, ఇతర సిబ్బంది నియామకాలు లేక చదువులు సాగే పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​. షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

YS SHARMILA PROTEST
వై.ఎస్​. షర్మిల
author img

By

Published : Oct 12, 2021, 1:25 PM IST

కేసీఆర్‌ పాలనలో విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవట్లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​. షర్మిల(ys Sharmila) ఆరోపించారు. నల్గొండ జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయటం లేదని ప్రశ్నించారు. తక్షణమే బోధనా సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైఎస్ హయాంలోనే పురుడు పోసుకుందన్న ఆమె... తన తండ్రి పేరు ఎత్తే అర్హత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేదని విమర్శించారు.

వై.ఎస్​. షర్మిల దీక్ష

ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష వారం చేపడతానని షర్మిల (ys Sharmila) వనపర్తి జిల్లా తాడిపత్రి పర్యటనలో చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ పర్యటనలో తెలిపారు. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్​తో ప్రతివారం ఒక్కో జిల్లాలో దీక్ష చేపడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ దీక్ష చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వారం నల్గొండ కేంద్రంలో దీక్ష చేస్తున్నారు.

ఇదీ చూడండి: Mega Aqua Hub in Sircilla : చేపలు, రొయ్యల పెంపకానికి సర్కార్ దన్ను.. 13వేల మందికి ఉపాధి

మైనారిటీలపై దాడుల కేసులో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.