organ donation in nalgonda: బతికినన్నాళ్లు ఎలా బతికినా పోయేలోపు నలుగురికి ఉపయోగపడే పనులు ఏమైనా చేసే పోవాలని పెద్దలు అంటారు. మాట సాయం చేయడానికే మనుషులు కరవైపోతున్న ఈ రోజుల్లో... నల్గొండ జిల్లా బాలంక వడ్డెర బజార్‌కు చెందిన రుపాని సైదమ్మ తన ప్రాణం పోయినా తర్వాత కూడా అవయదానం చేసి ఏడుగురి జీవితాలకు ప్రాణం పోసింది.
అసలు ఏమైందంటే...
జిల్లా కేంద్రంలోని బాలంక వడ్డెర బజార్‌లో రుపాని వెంకన్న, సైదమ్మ( 35) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమె ఇంటి దగ్గరే పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈ నెల 8న సైదమ్మ అపస్మారక స్థితిలో ఉండటంతో.. గమనించిన భర్త మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని మలక్ పేట యశోద హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. అత్యవసర వార్డులో వారం రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యినట్లు వెల్లడించారు.
ఔదార్యం చాటుకున్న కుటుంబసభ్యులు...
ఇది తెలుసుకున్న జీవన్ దాన్ వైద్య బృంధం ఆమె కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగహన కల్పించడంతో..కుటుంబసభ్యులు అంగీకరించారు. అప్పుడు సైదమ్మ 2 కిడ్నీలు, కాలేయం, 2 ఊపిరితిత్తులు, కంటి కార్నియాలు సేకరించి ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్ర చికిత్స ద్వారా అమర్చినట్లు జీవన్ దాన్ ఇంఛార్జి, వైద్యురాలు స్వర్ణలత తెలిపారు.
ఇదీ చదవండి:A family need for help: భర్త, బిడ్డపై క్యాన్సర్ పంజా.. దాతల సాయం అర్థిస్తున్న గృహిణి