ETV Bharat / state

Pranay Murder Case: ప్రణయ్​ హత్య కేసులో సాక్షుల విచారణ ప్రారంభం.. - ప్రణయ్​ హత్య కేసులో సాక్షుల విచారణ ప్రారంభం..

Pranay Murder Case: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్​ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సాక్షుల విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ప్రణయ్​ కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు... జులై 21 వరకు మొత్తం 102 మందిని విచారించనుంది.

Witnesses enquiry started in Pranay Murder Case

author img

By

Published : Jan 12, 2022, 4:55 PM IST

Pranay Murder Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సాక్షుల విచారణను మొదలుపెట్టింది. ఈ విచారణ ఈ నెల 3న ప్రారంభం కాగా.. జులై 21 వరకు కొనసాగనుంది. రోజుకు కొంతమంది చొప్పున మొత్తం 102 మందిని న్యాయస్థానం విచారించనుంది. ఇప్పటికే ప్రణయ్‌ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది.

ప్రణయ్​ కుటుంబసభ్యుల వాంగ్మూలం..

ప్రణయ్​ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం గతేడాది జనవరి నుంచి విచారణ ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా ఉద్ధృతి కారణంగా కోర్టుల్లో భౌతిక విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 3న ప్రారంభమైన విచారణలో.. 11 తేదీ వరకు ప్రణయ్‌ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, తల్లి ప్రేమలత, భార్య అమృతవర్షిణి నుంచి వివరాలను నమోదు చేసుకుంది.

హత్య నుంచి ఆత్మహత్య వరకు..

2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి, హతమార్చగా.. ఈ హత్యకు సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అదే ఏడాది సెప్టెంబరు 18న పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో అమృత తండ్రి మారుతీరావు, సుభాష్​శర్మ, అబ్దుల్‌బారీ, అస్గర్‌అలీ, అబ్దుల్‌ కరీం, శ్రవణ్‌కుమార్‌, డ్రైవర్‌ శివ, నిజాం ఉన్నారు. బెయిల్‌పై బయటకొచ్చిన మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.