నల్గొండ జిల్లా మిర్యాలగూడ పాత బస్టాండ్‌లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం ఆందోళనకు దారి తీసింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాత బస్టాండ్‌లో చిరు వ్యాపారం నిర్వహించుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి షాపుని తొలగించి అక్కడ సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేశారు.
కాగా మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్పర్సన్ అనుచరుడి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున అతను పోటీ చేసినందున కక్ష సాధింపు చర్యల్లో భాగంగా షాపును కూల్చివేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాగా పాత బస్టాండ్‌లో కూతవేటు దూరంలోనే సులభ్ కాంప్లెక్స్ ఉందని.. అక్కడే ఇంకొకటి కట్టాలని చూడడం రాజకీయకక్ష సాధింపు చర్యలేనని బాధితులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'