నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎగువ ప్రాంతాల నుంచి 89 వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా... అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా 46 వేల క్యూసెక్కులు, సాగర్ కుడి, ఎడమ కాలువలకు 15 వేలు, ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.