నాగార్జునసాగర్, టెయిల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి.. నీటి విడుదల కొనసాగుతోంది. జలాశయాల్లో గరిష్ఠ సామర్థ్యం మేరకు నిల్వ ఉంచి... ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్లో ఒక్కోగేటు 15 అడుగుల మేర ఎత్తి... మొత్తం 20 గేట్ల ద్వారా 4 లక్షల 49 వేల 352 క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను... 588.10 అడుగుల మేర నీరుంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 312.0450 టీఎంసీలకు గాను... 306.3966 టీఎంసీలు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 3 లక్షల 67 వేల 241 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. వచ్చిన నీటినంతా దిగువకు పంపుతున్నారు. మరోవైపు ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల పోలీసుల భద్రత కొనసాగుతోంది.
అటు టెయిల్ పాండ్లో మొత్తం 20 క్రస్టు గేట్లకు గాను... 18 గేట్ల ద్వారా 3 లక్షల 23 వేల 326 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 7.08 శతకోటి ఘనపుటడుగుల గరిష్ఠ సామర్థ్యమున్న టెయిల్ పాండ్లో.. 6.507 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు 4 లక్షల 64 వేల 866 క్యూసెక్కులు వరద నీరు వస్తుండగా... విద్యుత్తు ఉత్పత్తితోపాటు 15 క్రస్టు గేట్ల ద్వారా 3 లక్షల 31 వేల 312 క్యూసెక్కుల్ని విడిచిపెడుతున్నారు. 45.77 టీఎంసీల సామర్థ్యం గల పులిచింతల ప్రాజెక్టులో... 34.5448 శతకోటి ఘనపుటడుగుల నీరు నిల్వ ఉంది.
ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?