నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓటర్ లిస్టు చూసి అంతా షాకయ్యారు. ఓటరు పేరు ద... భర్త పేరు త... అని ప్రచురించారు. ఈ ఓటర్ 'ద'.. కు ఇంటి నంబర్, చిరునామా కూడా ఉంది. రేపు ఈ గ్రామంలో మూడో విడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు తామెలా ఓటు వేయాలని బాధితురాలు ప్రశ్నిస్తోంది. జాబితా తయారు చేసిన అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
